telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మోడీ ఏపీకి క్షమాపణలు చెప్పాకే.. రాష్ట్రంలో అడుగు పెట్టాలి.. ఉమా

tdp leader uma on parlament session speech

రాష్ట్రాన్ని విడదీసినంత సులభంగా విభజన సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేకపోయారని కేంద్రంపై తీవ్రంగా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్రంలో పర్యటించడం ఎంతవరకు సమంజసం అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి చేసిన అన్యాయానికి తగిన విధంగా ప్రధాని మోదీ.. క్షమాపణ చెప్పిన తర్వాతే ఏపీలో అడుగుపెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తొలిసారి గళం విప్పిన పార్టీ తెలుగు దేశం అన్నారు.

టీడీపీ కేంద్రమంత్రి పదవులు వదులుకుని.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నామని.. బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. నాలుగు బడ్జెట్లు వేచి చూసినా.. ప్రయోజనం లేదన్నారు. వైసీపీకి బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందన్నారు. ప్రధాని మోదీ ఏం చేశారని.. ఏపీకి వస్తారని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పిన తర్వాత ఏపీకి రావాలన్నారు. మోదీ, అమిత్ షాలు ఏపీలోకి అడుగుపెట్టగానే…మట్టికుండలు, నీళ్లతో ముఖాన కొడతారని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.

Related posts