telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద మెట్రో స్టాప్

metro services till midnight today

హైదరాబాద్ లోని అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20న అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రేపటి నుంచి మెట్రో కారిడార్‌-3లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌ను శనివారం ప్రారంభం కానుంది. సాంకేతిక, నిర్మాణ పనుల వల్ల ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌. ఈ స్టేషన్‌ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా, ఈ కారిడార్‌ ప్రారంభ సమయంలో ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన మాదాపూర్‌, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్లను వరుసగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Related posts