telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేడు మరో సమావేశం నిర్వహించనున్న బ్రిక్స్…

తన 12వ సమావేశాన్ని బ్రిక్స్ నిర్వహించనుంది. అయితే కరోనా సమయంలో ఒకేచోట గుంపుగా ఉండటం ప్రమాదకరమని, ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్హహించనున్నాట్లు సమాచారం. అయితే ఈ సమావేశాన్ని రష్యా నిర్వహిస్తుంది. దీనికి ప్రథాన కారణం ప్రపంచ స్థిరత్వత, అభివృద్దిగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వీరితో పాటు రష్యా ప్రధాని పుతిన్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ప్రపంచంలో జరుగుతున్న పెద్ద సమస్యలు, కరోనా గురించి దేశ ప్రతినిధులు ప్రస్తావించనున్నారు. ఇది బ్రిక్స్12వ సమావేశం ఇందులో యూఎన్ యోక్క 75వ యానివర్సరీ సందర్భంగా రష్యా నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో కరోనాతో పాటుగా టెర్రరిజం, ట్రేడ్, ఆరోగ్యం, ప్రజల గురించి ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా ఈసారి బ్రిక్స్ కుర్చీని మోదీ ఎక్కనున్నారు. దాంతో బ్రిక్స్ మూడో ప్రధానిగి మోదీ నిలువనున్నాడు. దాంతో పాటుగా చైనా ప్రధానిని షాంఘై తరువాత కలవడం ఇదే తొలిసారి. 13వ బ్రిక్స్ సమావేశం 2021లో జరగుతుందని ప్రకటించారు. అయితే ప్రస్తుత సమస్యలపై ప్రతిదేశం తమతమ అభిప్రాయాలను పంచుకుంటుందని పుతిన్ తెలిపారు.

Related posts