telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర..

*కుట్ర‌ను భ‌గ్నం చేసిన సైబ‌రాబాద్‌ పోలీసులు..
*మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర..మొత్తం 8 మందిని అరెస్టు

*శ్రీనివాస్‌గౌడ్‌ను చంపేందుకు రాఘవేందర్‌రాజు, ఇతర నిందితుల ప్లాన్‌
సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడి

టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్‌ హత్య కు 15కోట్ల రూపాయిల సుపారీ డీల్ కుదుర్చున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు సైబరాబాద్ పోలీసులు. ఈ కేసులో ప్రాధమికంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

శ్రీకాంత్‌ హత్యకు మహబూబ్​నగర్​కు చెందిన యాదయ్య, విశ్వనాథ్‌, నాగరాజు.. సుపారీ గ్యాంగ్​తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్​ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని ఫరూక్.. పేట్​బషీరాబాద్​ పోలీసులు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యాదయ్య, విశ్వనాథ్‌, నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు..నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో.. దిల్లీలోని భాజపా నేత జితేందర్‌ రెడ్డి నివాసంలో రఘును అరెస్ట్​ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం ముగ్గురినీ విడిచిపెట్టారు. హత్య కుట్ర కోణాన్ని దిల్లీ పోలీసులకు సైబరాబాద్‌ పోలీసులు తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే ..

గత నెల 25వ తేదిన పేట్ బషీర్ బాద్ పిఎస్ పరిధిలోని సుచిత్ర వద్ద హైదర్ ఆలీ , ఫారుఖ్ పై నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ లు మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని పారిపోయిన హైదర్ ఆలీ, ఫారుఖ్ లు అదే రోజు సాయంత్రం పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసిన పోలీసులు గత నెల 27వ తేదిన యాదయ్య,నాగరాజు,విశ్వనాధ్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.నిందితులను విచారిస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ కు చెందిన రఘవేంద్రరాజు,మధుసూదన్ రాజు,అమరేందర్ రాజు మరికొందరితో కలసి తెలంగణా ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిట్లు తెలిసింది.

మంత్రి హత్య చేసినా , లేదా చేయించినా 15కోట్లు ఇస్తానంటూ మధుసూదన్ రాజు అనే వ్యక్తి నాగరాజుకు చెప్పడంతో నాగరాజు ఆ పనిని నవంబర్ 18వ తేదిన ఫరుఖ్ కు అప్పగించడంతో ఫరుఖ్ ఇదే విషయాన్ని తన స్నేహితుడు హైదర్ ఆలీకి చెప్పాడు.రహస్యంగా ఉంచాల్సిన విషయం ఆలీకి చెప్పాడంతో విషయం తెలసుకున్న నాగరాజు ,యాదయ్య, విశ్వనాధ్ లు కలసి ఆలీ,ఫరుఖ్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు సిపి తెలిపారు.అలా ఫరుఖ్ ఫిర్యాదుతో మంత్రి హత్య కుట్ర వెలుగుచూసిందన్నారు.

దీంతో..ఈ కేసులో నాగరాజు,విశ్వనాధ్, యాదయ్య,అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు,మధుసూధన్ రాజు,మున్నూర్ రవి,థఫాను అరెస్ చేసినట్లు సిపి తెలిపారు.

Related posts