telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్యాంక్ బండ్ లో గుట్టలు లేవు.. బంజారాహిల్స్ లో హిల్సూ లేవు: కిషన్ రెడ్డి

kishan reddy mp

మానవ సమాజం అత్యాశకు పోయి ప్రకృతిని ధ్వంసం చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద “సేవ్ అవర్ జియో హెరిటేజ్” వాక్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి గురించి, భావి మానవ సమాజం గురించి ఆలోచన చేయని దౌర్భాగ్యపు స్థితి ప్రపంచంలో ఉందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు.

ప్రకృతి పరంగా హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు గుట్టలు, ప్రకృతి అందాలతో ఉండేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చూస్తే బంజారాహిల్స్ లో బంజారా లేదు హిల్సూ లేవని అన్నారు. ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రకృతి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పాటుపడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts