దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్ లో చీకోడ్, మిరుదొడ్డి, గొడుగు పల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపిటిసి సభ్యులు మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మదేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో గెలుపు ఖాయమైందని, దుబ్బాక ప్రజలు 99% టిఆర్ఎస్ లో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఖద్దరు అంగీలు వేసుకొని దుబ్బాకకు బయలుదేరారన్న అయన గతంలో ఎప్పుడు రానివారు ఇప్పుడు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంటే ఒక ఇంటికి త్రాగు నీరు ఇవ్వలేదు… ఒక ఎకరా కు సాగు నీరు ఇవ్వలేదని ఆయన అన్నారు.
రైతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే కనీసం అండగా లేని కాంగ్రెస్ కు ఎలా ఓటేయమంటారని ప్రశ్నించారు. ఏ మోహం పెట్టుకొని కాంగ్రెస్ కు ఓట్లడుగుతని ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి కి అండగా ఉండి అన్ని అభివృద్ధి పనులు చేస్తామని హరీష్ పేర్కొన్నారు. జాగా లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం.. జాగ ఉన్నవారు మీరే కట్టుకునే అవకాశం కల్పస్తామని ఆయన అన్నారు. దుబ్బాక పెద్ద చెరువు కట్ట చూడుమని ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సవాల్ విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక లో జరిగిన అభివృద్ధి పనులు చూసి సోయి తెచ్చుకోమని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిసిన లింగన్న కు హైదరాబాద్ లో ఒక అపార్ట్ మెంట్ లేదన్న ఆయన దుబ్బాక లో టిఆర్ఎస్ పక్క గెలుస్తదనే నమ్మకం ఉందని, కాని రెండో స్థానంలో ఎవరుంటరో చూడాలని అన్నారు.
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు