telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్‌ బాబు

Mohanbabu demand fees reimbursement

ప్రముఖ సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పదవి ఆశించి తాను వైసీపీలో చేరలేదన్నారు.

తెలుగు ప్రజల మంచి కోసమే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రితో అనేక సార్లు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్స్ బకాయిలను తమ కాలేజీకి చెల్లించలేదన్నారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కింద తమ సంస్థకు రూ.19 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. నా ఆస్తులను తాకట్టు పెట్టి లెక్చరర్లకు జీతాలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

Related posts