telugu navyamedia
క్రీడలు వార్తలు

విదేశీ ప్లేయర్స్ కంటే మనవాళ్ళే బెటర్ : దాదా

కరోనా కారణంగా ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లలో ఆటగాళ్లు అందరూ బయో బుడగలో ఉంటున్నారు. అయితే ఈ బయో బబుల్ లో వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలను తట్టుకోవడంలో విదేశీయులతో పోలిస్తే.. భారత క్రికెటర్లు మరింత బెటర్ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. తాజాగా దాదా మాట్లాడుతూ… ‘విదేశీ క్రికెటర్లతో పోలిస్తే మన భారతీయులు మరికాస్త ఎక్కువ ఒత్తిడి తట్టుకోగలరు. మనవాళ్లే మానసికంగా చాలా బలవంతులు. నేను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజీలాండ్‌ క్రికెటర్లతో కలిసి ఆడాను. మానసిక ఆరోగ్యం విషయంలో వారు సున్నితంగా ఉంటారు. 6-7నెలలుగా బయో బుడగల్లో విపరీతంగా క్రికెట్‌ జరుగుతోంది. ఇది చాలా కఠినమైన విషయం. హోటల్‌ నుంచి మైదానంలోకి వచ్చి ఒత్తిడి అనుభవించి మళ్లీ హోటల్‌కే వెళ్లాలి. ఇదంతా ఓ కొత్త జీవితం’ అని అన్నారు. ‘ఆస్ట్రేలియా టీంను ఓసారి గమనిస్తే.. టీమిండియా పర్యటన తర్వాత టెస్టు సిరీస్‌ కోసం వారు దక్షిణాఫ్రికా వెళ్లాలి. కానీ అక్కడకు వెళ్లలేదు. వారికీ కరోనా భయం పట్టుకుంది. అందుకే చాలా సానుకూలంగా ఉండాలి. మానసికంగా సన్నద్ధం అవ్వాలి’ అని గంగూలీ పేర్కొన్నారు. ఐపీఎల్ 2021 రేపే ప్రారంభం కానుంది. దాంతో దాదా అన్ని విషయాలు చూసుకుంటూ లీగ్ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.

Related posts