telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే కోర్టు తీర్పులను గౌరవిస్తున్నాం: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

 ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  వరుసగా కోర్టు తీర్పులు రావడం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పందించారు. రాజ్యాంగం కొన్ని హక్కులు, బాధ్యతలు ఇస్తూ కొన్ని హద్దులను కూడా నిర్ణయించిందని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయ వికృత చేష్టలు పరాకాష్టకు చేరడంతో పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని తెలిపారు.

ప్రభుత్వ విధానాలను మార్చేందుకు కోర్టుల జోక్యం కోరడం, కోర్టు ఆదేశాలతో “ఇది ఆపేయండి, అది నిలిపివేయండి” అంటూ చెబుతుంటే ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ప్రజాప్రతినిధులెందుకు? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

ఏపీలో గతంలో ఎన్నడూలేని వింత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలను కూడా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పని చేయాలన్నారు. అందుకే కోర్టు తీర్పులను గౌరవిస్తున్నామని సీతారాం పేర్కొన్నారు.

Related posts