telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇదే బీజేపీ పార్లమెంటరీ బాష .. సరైందేనా ? – కేంద్రంపై కేటీఆర్ ఫైర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ప్రధాని సహా ఆ పార్టీ నేతలు మాట్లాడిన అన్ పార్లమెంటరీ పదాలను గుర్తు చేశారు.

ఎన్‌పీఏ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 2021లో వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్న రైతులను ప్రధాని మోడీ ఆందోళ‌న్ జీవి అని పిలవడం పార్ల‌మెంటరీ భాష అని కేటీఆర్ ప్రశ్నించారు.

‘షూట్ సాలోంకో’ అని ఓ మంత్రి చెప్పడం సరైందేనా అని కేటీఆర్ నిలదీశారు. 80-20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించ‌డం, మ‌హాత్మాగాంధీని కించ‌ప‌రిచిన బీజేపీ ఎంపీ తీరు, ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను అవ‌మాన‌ప‌రుస్తూ.. వారిని టెర్ర‌రిస్టులు అని సంబోధించిన తీరును గుర్తు చేశారు. ఇదే బీజేపీ పార్లమెంటరీ బాష అంటూ ఫైరయ్యారు.

జూలై 18న జరగనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో లోక్‌ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్‌ సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేశారు

ఈ జాబితాలో చేర్చబడిన పదాలు, వాక్యాలు ‘అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్’ వర్గంలో చేర్చారు. వాటిలో జుమ్లాజీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, జైచంద్, లాలీపాప్, చందల్ క్వార్టెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బేహ్రీ సర్కార్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటి పదాలు ఉన్నాయి.

పార్లమెంట్‌లో పదాల వాడకంపై కేంద్రం నిషేధం విధించడంపై రాజ‌కీయంగా దుమారం రేపుతోంది దీనిపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, టీఎంసీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు.

Related posts