telugu navyamedia
ఆంధ్ర వార్తలు

త‌ల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్య‌గ‌ల‌ను..పరిధులు దాటవద్దు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు.  శనివారం ఉదయం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆదాన్ అనే కంపెనీ మాది అని చంద్రబాబు, టీడీపీ దుష్ర్పచారం చేస్తున్నార‌ని మండిపడ్డారు.  శ్రీనివాస్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందిన వాడని ఆరోపిస్తున్నారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌లో విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి కూడా ఆ కంపెనీలతో సంబంధం ఉన్నట్టేనా?. రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, లోకేష్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

కార్పొరేట్‌ రంగంలో చంద్రబాబుకు ఉన్న చర్రిత మరెవరికీ లేదు. వరసకు చంద్రబాబు నాకు అన్న అవుతారు. నా భార్య బంధువును తారకరత్న పెళ్లి చేసుకున్నారు. అలా అయితే చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా?.

తల్చుకుంటే మీరు చేసే దుష్ప్రచారం కంటే పదింతలు దుష్ప్రచారం చేయగలను. పరిధులు దాటవద్దు అని చంద్రబాబు, లోకేష్ కి వార్నింగ్ ఇస్తున్నా.. అని హెచ్చరించారు విజయ సాయిరెడ్డి. మీరు వాడే అసభ్య పదజాలం మేము కూడా వాడగలం..ఆకాశం పైకి ఉమ్మెస్తే అది నీ మీదే పడుతుంది చంద్రబాబు… వేలకోట్ల ఎగ్గొట్టిన క్వారీ ప్రమోటర్లు ఎవరూ చంద్రబాబు..నీ భాగస్వామ్యులు కాదా…? అని తీవ్రంగా మందలించారు.

ముత్తురాజు విజయకుమార్‌కు సత్యం కంపెనీతో సంబంధం ఉంది. ముత్తురాజుకు మీ కంపెనీలతో సంబంధం ఉంది. అలాంటప్పుడు మీకు సత్యం కంపెనీతో సంబంధం ఉన్నట్టేనా?. ఏదో ఒక రకంగా బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మానుకోవాలి’’ అని హెచ్చరించారు.

Related posts