telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మేం వచ్చాకే అదానీ, అంబానీల అడుగులు ఏపీలో పడ్డాయి ..పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు.

ఏటీసీ ఫస్ట్ పేజ్ లో రూ. 1384 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేసింది ఏటీసీ సంస్థ. రూ. 816 కోట్లతో రెండో దశ పనులకు ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 1002 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మొత్తం 250 ఎకరాల్లో ఈ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటైందిఈ పరిశ్రమల ద్వారా సుమారు 4,664 మందికి ఉపాధి లభ్యం కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ జ‌గ‌న్‌ ప్రసంగించారు .15 నెలల్లోనే ఈ పరిశ్రమ మొదటి దశ పనులు పూర్తి చేశామన్నారు. ‘రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు కంపెనీలు రానున్నాయని చెప్పారు.

మరో రెండేళ్లలో 56 లార్జ్ మెగా ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రానున్నాయి. లక్షకు పైగా మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే దేశంలో నెంబర్ 1 గా ఉన్నామ‌ని జగన్ అన్నారు

గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు కానీ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని అన్నారు. అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు.. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు.

రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని.. 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అంటూ జగన్‌ ప్రకటించారు.

Related posts