telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండ‌దు -మాధవ్ వీడియో కేసులో సీఐడీ చీఫ్ సునీల్ వివరణ

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలో ఆయ‌న‌ మాట్లాడుతూ..ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ వుండదన్నారు.

మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికమని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆ వీడియోని మూడో వ్యక్తి షూట్ చేశాడని.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని ఆయన చెప్పారు. రెండు ఫోన్‌లలో జరిగిన సంభాషణే ఒరిజినల్ అని సునీల్ కుమార్ తెలిపారు.

వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల చెప్పారని.. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారని సునీల్ కుమార్ పేర్కొన్నారు.

టీడీపీ నేత‌ల‌ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించి విడుదల చేసిన రిపోర్టుపైనా తాము విచారణ జరిపామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.

జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతున్న నివేదిక తనది కాదని స్టాఫర్డ్ తనకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారన్నారు.ఆ వీడియో కంటెంట్ ఒరిజనలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని.. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుడు నుంచి వివరణ తీసుకున్నామన్నారు.

ఓ స్క్రీన్ మీద రన్ అవుతోందన్న దాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చరన్నారు. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్నారు. ఫేక్ డాక్యుమెంట్ సర్కులేట్ చేసిన వారిపై ఐటీ చట్టం 67 ప్ర‌కారం చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ ప్రకటించారు.

Related posts