telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆంధ్రాలో సంక్రాంతి.. వీటితోనే ప్రారంభం…పోలీసులు కూడా.. 

sankranthi celebrations in ap
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది, కోడి పందేలు. అయితే ఇటీవల వీటిని కోర్టు నిలువరించేందుకు కూడా ప్రయత్నించింది. కానీ, జరుగుతూనే ఉండటం అక్కడి వారి ఆసక్తికి చిహ్నం. అయితే వీటివలన అనవసరంగా సాధారణ పౌరులు పందేలతో సర్వం కోల్పోతున్నారని భావించిన కోర్టు, ఈ పందేలను చట్ట వ్యతిరేకం అని తేల్చింది. మళ్ళీ పండగ రానేవచ్చింది… పందెం కోళ్లు కూడా పోటీకి సిద్ధం చేసేశారు.. ఇక మిగిలింది పోటీలు.. నిర్వాహకులు ఒకపక్క అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోపక్క పోలీసులు కూడా వారిని ఒక కంట కనిపెడుతూ.. ఉండటం ప్రస్తుతం గోదావరి జిల్లాలలో కనిపిస్తున్న సంక్రాంతి సందర్భం. మేము ఎవరిని పట్టించుకోము అంటూ, ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. 
దూర ప్రాంతాల్లో స్థిరపడిన పలువురు స్వస్థలాలకు వస్తుండటంతో పల్లెలలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇదే సమయంలో కోడి పందాలు కూడా మొదలు కాగా, పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్దాపురం సమీపంలోని రంగంపేట వద్ద పామాయిల్ తోటలలో పందాలు ఇప్పటికే ప్రారంభం కావటం, ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంపై దాడులు చేయడం, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, పందం కోళ్లను, నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిపోయాయి. కోడి పందాలకు అనుమతి లేదని, పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క వాళ్లలోనే కొందరు చక్కగా పోటీలలో పాల్గొని, ఇది సాంప్రదాయం అంటూ.. చెప్పుకొస్తుండటం కొసమెరుపు. ఇది ప్రారంభమే, పండగ నాడు అసలు సిసలైన పందేలు జరుగుతాయి.. వాటిని పోలీసులు ఎలా నిలువరిస్తారో చూడాల్సి ఉంది. 

Related posts