ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాదమికహక్కులకు అడుగడుగునా భంగం వాటిల్లుతోందన్న ఆయన పోలీస్ లపై వ్యక్తిగతంగా రిజిస్టర్ అయిన కేస్ ల విషయం లో ఏపీ పోలీస్ లు ప్రధమ స్థానంలో వున్నారని అన్నారు. శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అనేక దుర్ఘటనలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని అన్నారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఏ కల్పించిన వాక్ స్వాతంత్ర్యంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని అన్నారు. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినవారిని వెంటాడటం, అర్ధరాత్రి అరెస్ట్ లు, హింసాత్మక దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, దుర్భాషలు, అసభ్య ప్రచారం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని బాబు పేర్కొన్నారు. పోలీసులలో ఈ విధమైన ఉదాసీనత, పట్టించుకోకపోవడం మంచిదికాదు, రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు.