telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది..

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. తన వీడియో మార్ఫింగ్ చేశారని ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళ ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా, ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని మీడియాకుచెప్పారు. 

సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో.. అన్నదాని పై  ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని ఆమె తెలిపారు. వీడియో మార్ఫింగ్ కాదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనిత స్పష్టం చేశారు.

గోరంట్ల మాధవ్‌ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మహిళా నేతలపై తానేటి వనిత మండిపడ్డారు.

కాగా  ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ మహిళా నేత వంగళపూడి అనిత నిరసన వ్యక్తం చేశారు. మాధవ్‎పై చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ  మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత మండిపడ్డారు.   

రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎంపీని కాపాడుతున్నట్టు, బాధిత మహిళకు అన్యాయం చేస్తున్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటున్న మహిళలు వాడుతున్న భాష,  వారి బాడీ లాంగ్వేజ్… రాష్ట్రంలోని మహిళలంతా సిగ్గుపడే విధంగా ఉందన్నారు. 

Related posts