telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాజీనామా పై కేశినేని సంచలన వ్యాఖ్యలు…

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబును ఏకవచనంతో పిలిచారని, వైసీపీ ఎంపిలను లంచ్ కు పిలిచారని విమర్శలు చేశారు.  కాగా, నేతలు చేసిన విమర్శలపై నాని వివరణ ఇచ్చారు.  ” నాకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవు. నాపై నేతల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఎవరికీ ఫిర్యాదు చేయను.  అధిష్ఠానం చూసుకుంటుంది. బెజవాడలో టీడీపీని గెలిపించడంపైనే నా దృష్టాంత. చంద్రబాబు ఆదేశిస్తే ఒక్క నిమిషంలో ఎంపీ పదవికి రాజీనామా. బీజేపీ, వైసీపీ ఎంపీలను లంచ్ కు పిలిస్తే తప్పేంటి.  అది పార్లమెంట్ సంప్రదాయం. పార్లమెంట్ సెంట్రల్ హాల్ గురించి ఇక్కడి నేతలకు తెలియదు. చంద్రబాబు రూట్ మ్యాప్ ను నేను మార్చలేదు.  అది పార్టీ నిర్ణయం” అని అన్నారు.  మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో వచ్చిన విభేదాలు ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపిస్తాయా… చూడాలి.  అయితే ప్రస్తుతం కేశినేని టీడీపీ నేతల మధ్య మొదలైన వార్ ముదురుతోంది అనేది తెలుస్తుంది.

Related posts