కేంద్రం సడలింపులివ్వడంతో ఏపీలో నిన్న మద్యం షాపులను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో మద్యం ధరలను మరోసారి పెంచింది. నిన్న షాపులను తిరిగి ప్రారంభించిన తరువాత, 25 శాతం మేరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ధరలు పెంచినప్పటికీ, షాపుల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించాయి.
భౌతిక దూరం పాటించకుండా జనాలు ఎగబడడం పై సమీక్షించిన జగన్, మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు దూరం చేయాలని నిర్ణయించారు. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మరో 50 శాతం మేరకు ధరలను పెంచాలనిపెంచామని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ వెల్లడించారు. పెరిగిన కొత్త ధరలతో ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. దీంతో నిన్న పెరిగిన 25 శాతం కలిపి, మొత్తం 75 శాతం మేరకు ధరలు పెరగడంతో మందుబాబులకు షాక్ తగిలింది. ప్రతిపక్షాలు మాత్రం జే ట్యాక్స్ అంటూ మండిపడుతున్నాయి.
వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి