తెలంణగణాలో ఈ దీపావళికి క్రాకర్స్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. క్రాకర్స్ బ్యాన్ చేయాలని కోర్టుకి వెళ్లిన అడ్వొకేట్ కి దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కేసు వేసి బ్యాన్ చేయిస్తే వాటిని అమ్మేందుకు తెచ్చిన వ్యాపారులు ఎక్కడ పోవాలి అని అడిగారు. పోలీసులు రైడ్ చేసి మూసి వెయిస్తున్నారు..వాళ్లు ఇప్పుడు వాటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇళ్లలో పెట్టుకుంటే ఏదన్నా జరగరానిది జరిగితే ఎవరు బాద్యులు అన్నారు. అప్పుతెచుకున్న వారి పరిస్థితి ఏంది అని ప్రశ్నించిన ఆయన దీపావళి ఎప్పటి లాగానే జరుగుతుంది అని తెలిపారు. గోవుల ను వదించొద్దని చట్టం ఉంది. క్రాకర్స్ బ్యాన్ పై ఉత్సాహం చూపుతున్న పోలీస్ లు గోవుల వధ విషయంలో ఎందుకు స్పందించడం లేదు అన్నారు ఆయన. ఎంఐఎం మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నారు. హిందువుల పట్ల ఇలానే వ్యవహరిస్తే నిజామాబాద్ ,దుబ్బాక,లో ఏమి జరిగిందో రేపు జీహెచ్‌ఎంసీ లో అదే జరుగుతుంది అని హెచ్చరించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
కేసీఆర్ ఇలాకలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ: కేటీఆర్