telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్‌ను ఎడిట్ చేసిన అమెజాన్…

“ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” ట్రైలర్ పై కాంట్రవర్సీ జరుగుతున్న విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అవుతోంది. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ అసలు టెర్రరిస్ట్ సంస్థ కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ ఫైర్ అయ్యారు తమిళ తంబీలు. దీంతో దిగొచ్చిన అమెజాన్ ప్రైమ్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” ట్రైలర్‌ను ఎడిట్ చేసి విడుదల చేసింది. కాగా “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. జూన్ 4న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

Related posts