సీనియర్ పేసర్లు ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో మహ్మద్ సిరాజ్ కు చోటు దొరుకుతుందో లేదో అన్న అనుమానం లక్ష్మణ్ వ్యక్తం చేశారు. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ జరగనుంది. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ‘మహ్మద్ సిరాజ్ మరికొన్నేళ్లు ఇలాగే కష్టపడితే.. అంతర్జాతీయ క్రికెట్లో అతడి పేరు కచ్చితంగా మార్మోగుతుంది. అతడికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. ఎంతో సత్తా ఉంది. ప్రతి ఫాస్ట్ బౌలరుకు రెండు లక్షణాలు ఉండాలి. మొదట బంతిని అద్భుతంగా స్వింగ్ చేయాలి. సిరాజ్ అందులో నేర్పరి. సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం రెండోది. అతడిలో ఈ సత్తా కూడా ఉంది. ఒక రోజులో మూడో స్పెల్ సైతం సిరాజ్ వేయగలడు. అంతేకాదు మొదటి రెండు స్పెల్స్‌లోని వేగం, కచ్చితత్వాన్ని కూడా కొనసాగించగలడు’ అని అన్నారు. ‘ప్రస్తతం టీమిండియా మంచి ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉండటం మన అదృష్టం. మహ్మద్ సిరాజ్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంగర్ స్పెల్స్ కోసం ఉపయోగించాలని కోరుతున్నా. సిరాజ్ రోజులు గడిచేకొద్దీ మెరుగుపడుతాడని నేను భావిస్తున్నా అని తెలిపారు.
previous post
రైతులపై పడ్డ ప్రతీ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది: పవన్