telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తన జీవితం ప్రజలకే అంకితం: కవిత

MP Kavitha comments BBP Govt.

నిజామాబాద్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సమీప బెజేపీ అభ్యర్తి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల్లో ఓటమి పై కవిత ట్విటర్ లో స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ చేశారు.

అధిక సంఖ్యలో రైతులు పోటీలో నిలిచిన నిజామాబాద్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 62 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఓడిపోవడంతో రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

Related posts