telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

విజయవాడ : … స్విగ్గి పై .. హోటల్ యాజమాన్యాల అసంతృప్తి.. సేవలు నిలిపివేత..

swiggy providing more jobs

నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్‌పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ పోర్టల్స్.. ఇప్పుడు 18 నుండి 25 శాతం డిమాండ్ చేయడం దారుణమన్నారు. స్విగ్గీ సేవలను నవంబర్ 11 నుంచి నిలిపివేస్తున్నట్టు హోటల్ యజమానులు ప్రకటించారు. ఫుడ్ ఆర్డర్లపై ప్రస్తుతం తీసుకుంటున్న కమిషన్ ను 18 నుంచి 25 శాతానికి పెంచుతూ ఫుడ్ యాప్ తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ నిరసించింది. స్విగ్గీ యాప్ సేవలను నవంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి విరమించుకుంటున్నట్లు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

స్విగ్గీ నగరంలో ఏడాదిన్నర క్రితం ఫుడ్ ఆర్డర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. అప్పట్లో హోటళ్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా వినియోగదారులకు డెలివరీ చేసింది. కానీ ఆ తర్వాత పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని కమిషన్ ను ఒక్కో రూపాయి పెంచుకుంటూ 10 శాతానికి చేర్చాయి. ఆ తర్వాత ఇది 18 శాతానికి పెరిగిపోయింది. తాజాగా ఈ 18 శాతం కమిషన్ ను 25 శాతానికి పెంచాలని ఫుడ్ డెలివరీ యాప్ సిండి కేట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ భగ్గుమంది. అసలే 6నెలల నుంచి అనుకున్న రీతిలో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఫుడ్ డెలివరీ యాప్ కమిషన్ పెంపు నిర్ణయం మరింత భారంగా మారుతుందని అసోసియేషన్ వాపోయింది.

Related posts