telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బెంగళూరు : … యడ్డికి మరో చిక్కు … అనర్హత ఎమ్మెల్యే ఆడియో బహిర్గతం..

yadurappa on audio tape

అనర్హత వేటుకు గురైన ఓ ఎమ్మెల్యే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం యడ్యూరప్ప తనకు రూ. 1000 కోట్లు ఇచ్చాడని మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ చెప్పారు. ఆ మొత్తాన్ని తాను తన నియోజకవర్గం కృష్ణరాజ్‌పేట్ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కొందరు మా ఇంటికి వచ్చి నన్ను బీఎస్ యడ్యూరప్ప నివాసానికి ఉదయం 5 గంటలకు తీసుకెళ్లారు(హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ముందు). మేము అక్కడికి వెళ్లే సమయానికి యడ్యూరప్ప పూజలో ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరి వచ్చి కూర్చోమన్నారు. తాను మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకు మద్దతివ్వాలని యడ్యూరప్ప కోరారు ‘ అని నారాయణ గౌడ వెల్లడించారు.

నారాయణ తన నియోజకవర్గం కృష్ణరాజ్‌పేట్ అభివృద్ధి కోసం రూ. 700 కోట్లు కేటాయించాలని కోరానని, ఇందుకు అతను(యడ్యూరప్ప) మరో 300 కోట్లు జత చేసి రూ. 1000 కోట్లు ఇస్తానని చెప్పారని ఆ ఆడియో సారాంశం. ఆ తర్వాత డబ్బును నాకు అందజేశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వకుండా ఎలా ఉండగలను. అందుకే మద్దతిచ్చా. అనర్హత ఎమ్మెల్యేల నుంచి ఏమీ ఆశించలేమని, వారితో సంబంధం లేదని యడ్యూరప్ప చెప్పారని నారాయణ గౌడ తెలిపారు. ఈ ఆడియో టేప్ విడుదలవడంతో సిద్ధరామమయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్‌ను మెమోరాండం అందజేసింది. ఆయన ద్వారా రాష్ట్రపతిని.. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, అమిత్ షాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.

Related posts