తెలంగాణకు నవోదయ పాఠశాలల ఏర్పాటు చేసే విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నవోదయా పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండగా ప్రస్తుతం కొత్తగా మరో 23 జిల్లాలు ఏర్పాటయ్యాయని ఆయన అన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా జనాభా దాదాపు నాలుగుకోట్లకు చేరుకుంటోందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం తొమ్మిది నవోదయ స్కూల్స్ మాత్రమే ఉన్నాయని, కొత్తగా మరరో 24 పాఠశాలలు ఏర్పాటుచేయాలని, తెలంగాణ వ్యాప్తంగా 33 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధాన మంత్రిని కోరారని అన్నారు. తాను ఎంపిగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణకన్నా తక్కువ జనాభా ఉన్న ఉత్తర, మధ్య భారతదే శ రాష్ర్టాలకు పెద్దయెత్తున నవోదయ పాఠశాలలను కేటాయించారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదన్నారు. చత్తీస్‌ఘడ్ , అసోం, హర్యానా వంటి రాష్ర్టాల కన్నా తెలంగాణలోనే జనాభా సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాలను ఏర్పాటుచేస్తే గ్రామీణ ప్రాంత బాల బాలికలకు ఎంతో ఉపయోగ పడుతుందని వినోద్‌కుమార్ అన్నారు. ఈమేరకు ప్రభుత్వాక సిఫారసు చేయాలని వినోద్‌కుమార్ నీతి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌ను కోరారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు