telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 తెలుగు : .. ఎవడి గోల వారిదే .. కింగ్ కంగారు..

ou students complaint on bigg boss 3 telugu

తాజా ఎపిసోడ్ లో నాగార్జున గారి ముందు ఐదుగురు ఇంటి సభ్యులు తమ పరువు పోగొట్టుకున్నారు. వారు బాబా, హిమజ, రాహుల్, శ్రీముఖి, రవి. బాబా భాస్కర్ అవతలి వాళ్ళని ఏదైనా అంటాడు. తన అభిప్రాయాలని మొహం మీదే చెప్తాడు. నువ్వు ఎలిమినేట్ అవుతావని ఫ్రాంక్ గా చెప్తాడు. కానీ తన గురించి ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే తీసుకోలేడు. శనివారం శివజ్యోతి బాబాని మహానటుడు అని చెప్పినపుడు తట్టుకోలేకపోయాడు. కాదు సార్ అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. మొదటి నుండి బాబా భాస్కర్ వరస అలాగే ఉంది. ఇక హిమజ, నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే షూ పాలిష్ చేస్తాడు. అపుడు ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతుంది. నాగార్జున చెప్పిన మాటలకి చప్పట్లు కొట్టవచ్చు, కానీ అదే పనిగా ఎక్కువసేపు చప్పట్ళు కొట్టడం అనేది తప్పు చేసిన వాళ్ళని కించపరిచినట్లే అవుతుంది. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. ప్రతీ వారం ఎవరో ఒకరు తప్పులు చేస్తూనే ఉంటారు.

హిమజ అలా చేయకుండా ఉండాల్సిందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇక రాహుల్, రాహుల్ హౌస్ లో పునర్నవి, శ్రీముఖి, మహేష్ లతో స్నేహంగా ఉంటున్నాడు. శ్రీముఖితో తనకి బయట పరిచయం ఉంది. కానీ ఈ ముగ్గురితో అతనికి ప్రాబ్లెమ్ ఉంది. ఎవరితోనైతే స్నేహం ఉందో వాళ్ళతోనే ప్రాబ్లెమ్ ఉండటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక శ్రీముఖి, రవి ల విషయానికొస్తే, మహేష్ గురించి మాట్లాడుతూ అతనికి సీరియస్ నెస్ లేదు, బయటకి వెళ్తే సినిమాలున్నాయి అంటాడని పదే పదే చెప్తున్నారు. ప్రతీ దానికి ఆ ఒక్క కారణం చెప్పడమే బాలేదు. ఏదో చెప్పాలి కాబట్టి ఆ కారణాన్ని పట్టుకున్నారు తప్పితే, వాళ్ళ అభిప్రాయాల్లో ఓపెన్ నెస్ కనిపించట్లేదు. ఇలా ఈ ఐదుగురు వ్యవహరించిన తీరు ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.

Related posts