telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడుదల కాకముందే “మిడిల్ క్లాస్ మెలోడీస్”మూవీ ఖాతాలో సరికొత్త రికార్డు…

ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రశ్మికా మందాన అమెజాన్ ఒరిజినల్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ ను ఇటీవలే ఆవిష్కరించారు. ఈ చిత్రానికి వినోద్ అంతోజు దర్శకత్వం వహించారు. ఈ రాబోయే తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్ల మ్మ నటించారు. భవ్య క్రియేషన్స్ చే నిర్మించబడింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది వినోదంలో ఓ తాజా శ్వాస. సకుటుంబ వినోదానికి హామీ ఇస్తుంది. నవ్వుల తో, నాటకీయతతో అల్లుకున్న మధుర ప్రేమకథా చిత్రం. సరదాగా సాగే హాస్యంతో కొంతమంది మధ్య తరగతి మనుషుల కలలు, నమ్మకాలు, పోరాటాలు, ఆశల చుట్టూరా ఈ చిత్రం తిరుగుతుంది. భారత దేశంలో మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు మిడిల్ క్లాస్ మెలోడీస్ యొక్క వరల్డ్ ప్రీమియర్ నవంబర్ 20న ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై మాత్రమే దీన్ని చూడవచ్చు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్‌ కు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 11 మిలియన్‌ వ్యూస్‌ ను దాటింది ఈ ట్రైలర్‌. ఒక చిన్న సినిమా ట్రైలర్‌ ఈ రేంజ్‌ లో వ్యూస్ దక్కించుకోవడం నిజంగానే విశేషం అని చెప్పాలి. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ సినిమా 11 మిలియన్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తోంది.

Related posts