telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లా నాయక్’ నుండి రానా టీజర్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చేసింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

ఇందులో రానా డేనియల్‌ శేఖర్‌ పాత్రలో నటిస్తున్నారు. ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో’ అంటూ రానా పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన మరో మలయాళ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related posts