telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ భేష్.. 200+ లక్ష్యం గా భారత్..

india top order failed on afghanistan

ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్-ఆఫ్ఘనిస్థాన్ లు తలపడుతున్నాయి. భారత్ అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. ఆఫ్గనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలిసారి ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాతో మ్యాచ్ లో ఆఫ్ఘన్ స్పిన్నర్లు అమోఘమైన ప్రదర్శన చేయడం విశేషం. సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థి స్పిన్నర్లు ముజీబ్ రెహ్మాన్, నబీల ప్రతిభావంతమైన బౌలింగ్ కారణంగా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపలేకపోయింది.

43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 67 పరుగులు చేసి అవుట్ కాగా, ధోనీ 27, జాదవ్ 30 పరుగులతో ఆడుతున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రెహ్మాన్ కు ఓ వికెట్, నబీకి 2 వికెట్లు లభించాయి. మరో వికెట్ రహ్మత్ షాకి దక్కింది. కాగా, గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 9 ఓవర్లలో 110 పరుగులు ఇచ్చుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్న రషీద్ ఖాన్, ఈ పోరులో 8 ఓవర్లు విసిరి వికెట్ తీయకపోయినా కేవలం 35 పరుగులిచ్చి ఆకట్టుకున్నాడు.

Related posts