తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో దిశను హత్య చేసిన నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో పోలీస్ గెటప్స్ వేసిన హీరోలు చెప్పే డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాను హిందీలో ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్ ఈ సినిమాలో జంటగా నటించారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ పోలీసుగా అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో కూడా ఆడవాళ్లపై అత్యాచారాలు చేసే నిందితులను ఎలాంటి శిక్షలు వేయాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అయితే ‘సింబా’ సినిమాలో అజయ్ దేవగణ్.. రణ్‌వీర్ సింగ్‌తో చెప్పే డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆడపిల్లను చూడగానే అత్యాచారం చేయాలన్న ఆలోచించే ఎదవలకు ఎలాంటి భయం కలగాలంటే.. ఎలాంటి కేసులు, కోర్టులు లేకుండా స్పాట్‌లోనే కాల్చి పడేసే తిక్క పోలీసులు కూడా ఉంటారని తెలిసిరావాలి’ అని అంటాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఓ నెటిజన్.. ‘సింబా సినిమాలో అజయ్ దేవగణ్ సీపీ సజ్జనార్’ అయివుంటారంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
#singham #VCSajjanar #Simmba
Salute to you sir🙏 pic.twitter.com/ZgdYOsBodJ— Nik (@nishant_pareek5) 6 December 2019