telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి సినిమాలోంచి సమంత అవుట్…!?

Samantha

‘ఏ మాయ చేశావే’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమంత దక్షిణాది టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. ఇటీవలే ఆమె నటించిన జాను సినిమా విడుదలైంది. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అంతేకాదు… నయనతార, సమంత కలిసి నటిస్తుండటం కూడా ఇదే ఫస్ట్ టైమ్. నయనతార, విజయ్ సేతుపతి కలిసి గతంలో నటించారు. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ‘‘కాతు వాకుల రెండు కాదల్’’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో నుంచి సమంత తప్పుకుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Related posts