telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

సరికొత్త కారు .. వచ్చేసింది.. ఇండియాకి…

3 door car first time in India
ఊరించే అంశాలు బోలెడు ఉన్న ఈ సరికొత్త కారులో.., ముందుగా చెప్పుకోవాల్సినది, ఇది మూడు డోర్ల హ్యాచ్‌. అమెరికాలో ఈ రకం మామూలే అయినా భారత్‌లో అరుదు. చూడ్డానికి రేసింగ్‌ వాహనంలా ఉండటమే కాదు.. రేస్‌ట్రాక్‌లో కూడా దూసుకెళ్లే విధంగా తీర్చిదిద్దారు. క్యాబిన్‌, సీట్లను నాణ్యమైన డినామికా లెదర్‌తో రూపొందించడంతో దర్పం ఉట్టిపడుతోంది. హెడ్‌రెస్ట్‌లతో కూడిన స్పోర్ట్స్‌ సీట్లు, నాణ్యమైన లెదర్‌తో చుట్టిన స్టీరింగ్‌, ఆటోమేటిగ్గా అడ్జస్ట్‌ చేసుకోగల్గిన స్టీరింగ్‌ సెన్సివిటీ, స్టీల్‌తో తయారైన పెడల్‌ క్యాప్‌లు, జాన్‌ కూపర్‌ వర్క్స్‌ బ్యాడ్జ్‌తో వచ్చిన డోర్‌ సిల్స్‌.. ఇతర ప్రత్యేకతలు. డ్రైవరు తల కిందికి దించాల్సిన అవసరం లేకుండా సమాంతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా డ్యాష్‌బోర్డ్‌పైన ప్రత్యేకంగా హెడప్‌ తెర ఇచ్చారు.
మీడియా ఔట్‌పుట్స్‌, నావిగేషన్‌, టెలిఫోన్‌ ఆప్షన్లు.. ఇందులో ఉన్నాయి. హై-ఫై ఆడియో సిస్టమ్‌, 12 స్పీకర్లు, డిజిటల్‌ యాంప్లిఫయర్‌ హోంథియేటర్‌ అనుభూతి కలిగిస్తాయి. షట్కోణ ఆకారపు రేడియేటర్‌ గ్రిల్‌.. అందులో తేనెగూడు ప్యాటర్న్‌లు యూనిక్‌ డిజైన్‌. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వాటి చుట్టూ మళ్లీ ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్లు.. ఇంటిగ్రల్‌ ఎయిర్‌డక్ట్స్‌, సైడ్‌ సిల్స్‌లాంటి ఏరో డైనమిక్‌ ఫీచర్లెన్నో ఉన్నాయి. 17 అంగుళాల ట్రాక్‌ స్పోక్‌ అల్లాయ్‌ చక్రాలు ప్రత్యేకం. మలుపులు, అత్యధిక వేగంలో వెళ్తున్నపుడు బండి నియంత్రణలో ఉండటానికి, మెరుగైన స్థిరత్వానికి 4 పిస్టన్‌, ఫిక్స్‌డ్‌ కాలిపర్‌ బ్రేక్‌లున్నాయి. 8.8 అంగుళాల తాకే తెర.. అందులో ఆరున్నర ఇంచుల సర్కిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ ఉంది. ఎల్‌ఈడీ బల్బ్‌ రింగ్‌ ఇచ్చారు. బ్లూటూత్‌ సాయంతో దీనికి ఫోన్‌, ఆడియోని అనుసంధానించుకోవచ్చు.
విదేశీ కారులు అంటేనే పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ తో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. 2.0లీటర్ల 4సిలిండర్‌ ట్విన్‌ పవర్‌ టర్బో ఇంజిన్‌.. 231 హెచ్‌పీ సామర్థ్యం దీని సొంతం. ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. భద్రత: భద్రతా ఫీచర్లకు  కొదవ లేదు. డ్రైవర్‌, ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌లు.. బ్రేక్‌ అసిస్ట్‌,  3 పాయింట్‌ సీట్‌బెల్ట్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, క్రాష్‌ సెన్సర్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్‌లాంటి ఫీచర్లున్నాయి. ప్రస్తుతం ఈ కారు ధర: రూ.43.50లక్షలు

Related posts