telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడు క్రిష్ కు పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Pawan

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా క్రిష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్… క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో నిర్మాత ఎ.ఎం.రత్నం, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, రచయితలు భూపతి రాజా, కన్నన్ లు ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పవర్ ‌స్టార్ పవన్ ‌కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్‌ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ లో పవన్ డేట్స్ ను ఇవ్వనున్నట్టు బజ్ వినిపిస్తుంది. మరి పవన్ ఎప్పుడు మొదలు పెట్టనున్నారో చూడాలి. ఇక ఇప్పుడు దాదాపు ఐదు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. వాటిలో దర్శకుడు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” దాదాపు పూర్తి కానుండగా తర్వాత క్రిష్, ఆ తర్వాత తన హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో సినిమాలు రెడీగా ఉన్నాయి.

Related posts