telugu navyamedia
సినిమా వార్తలు

“భారతీయుడు-2” కాజల్ అవుట్… రకుల్ ఇన్…?

Bharatheeyudu-2

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల భారీ గ్యాప్ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం “భారతీయుడు-2”. వీరిద్ద‌రి కాంబినేషన్‌లో 1996లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన “భార‌తీయుడు” సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలయ్యింది. అయితే బ‌డ్జెట్ కార‌ణాల‌తో సినిమా ఆగింది. నిర్మాణ సంస్థ లైకా శంక‌ర్‌కు బ‌డ్జెట్ ప‌రిమితులు విధించింది. ముందుగా నిర్మాతల షరతులకు ఒప్పుకోనంటూ దర్శకుడు శంకర్ బెట్టు చేసినప్పటికీ… చివ‌ర‌కు బ‌డ్జెట్ ప‌రిమితుల‌కు తలొగ్గ‌క త‌ప్ప‌లేదు. దీంతో ఆగిపోయిన సినిమా షూటింగ్ ఆగ‌స్ట్‌లో ప్రారంభము కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో్యిన్‌గా న‌టిస్తుంది. ‘భారతీయుడు-2’ ఆగస్టు మొదటి వారం నుండే షూటింగ్‌ ప్రారంభం కానుందని అంటున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘భారతీయుడు 2’ సినిమా ప్రారంభ సమయంలో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే, ఇప్పుడు ఆమెను ఈ సినిమా నుండి తప్పిస్తున్నారని సమాచారం. అంతేకాదు, ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరీ సినీయర్ హీరోయిన్ కాజల్‌ను ‘భారతీయుడు 2’ సినిమా నుండి ఎందుకు తప్పించారన్న విషయంపై మాత్రం సమాచారం లేదు. మరోవైపు రకుల్‌ ప్రీత్ కూడా దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ను శంక‌ర్ ఎంపిక చేసుకున్నార‌ట‌. హీరోయిన్స్‌ ఐశ్వ‌ర్య రాజేశ్‌, ప్రియా భ‌వాని కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారని తెలుస్తోంది.

Related posts