అత్తి వరదర్ ఉత్సవాల సందర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని జిల్లా కలెక్టరు పొన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో… ఈ ఆలయంలో జులై ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అత్తి వరదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కానుకలను చెల్లించు కోవడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ తరఫున 18 హుండీలను ఉంచామని తెలిపారు. వీటిల్లో 13 హుండీలలోని కానుకలను మాత్రమే లెక్కించారని వెల్లడించారు. తద్వారా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు చెప్పారు. మిగిలిన హుండీల కానుకలను లెక్కించాల్సి ఉందని తెలిపారు.