telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ “ఖిలాడీ”లో అనసూయ

Anasuya

హాట్ యాంకర్ అనసూయ తాజాగా రవితేజ హీరోగా రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాలో అవకాశం దక్కించుకుందని టాక్. రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడి’గా తన అభిమానులను అలరించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో ఈ ‘ఖిలాడి’ మూవీ రూపొందనుంది. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ అతిత్వరలో ప్రారంభం కానుంది.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. అయితే ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కోసం అనసూయను తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే రవితేజతో ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా చిందులేసి మాస్ కిక్కివ్వనుందట ఈ జబర్దస్త్ బ్యూటీ. మరోవైపు ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అనసూయ. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts