విజయ్ దేవరకొండ హీరోగా తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” విడుదల గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఎస్ రామారావు నిర్మాణంలో, క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న తన కొత్త చిత్రంపై విజయ్ దేవరకొండ దృష్టి పెట్టారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడిగా కన్పించనున్నాడు. కార్మికులకు యూనియన్ లీడర్ గా విజయ్ నటించనున్నాడట. అంతేకాదు కథ ప్రకారం సినిమాలో విజయ్ కి ఎనిమిదేళ్ల కొడుకు ఉంటాడని సమాచారం. అంటే ఈ సినిమాలో విజయ్ తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నమాట. అయితే కథలోని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే విజయ్ దేవరకొండ ఇలా కనిపిస్తాడట. క్లాస్, మాస్ రెండు వర్గాలకు చెందిన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.
previous post
యాంకర్ శ్యామలాకు ఆర్జీవీ అంతమాటానేశాడేంటి..?