బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ తరువాత తదుపరి దర్యాప్తు నిమిత్తం న్యాయస్థానం వారిని ఎన్సీబీకి అప్పగించింది. అప్పటి నుంచి వీరు జైలులోనే ఉన్నారు. అయితే పలుమార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. కోర్టు బెయిల్ నిరాకరించింది.
దీంతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ కుటుంబం బాధలో మునిగిపోయారు. ఆర్యన్ ఖాన్ తల్లి అయితే గౌరీ ఖాన్ తీవ్ర మనోవేధనకు గురైంది.. తిండి, నిద్ర లేకుండా ఆర్యన్ కోసమే ఎదురుచూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈద్, దీపావళీ, మన్నత్ వంటి పండగలకు షారుక్ నివాసం ఎంతో అందంగా ముస్తాబయ్యేది. కానీ ప్రస్తుతం ఆర్యన్ జైలులో ఉండటంతో పండుగ సెలబ్రేట్ చేసుకునే ఆసక్తి లేదని, ఆర్యన్ విడుదల అయ్యేంతవరకు ఇంట్లో స్వీట్లు చేయరాదని ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. షారుక్, గౌరీ దంపతులు వేడుకలు చేసుకునే మూడ్లో ఏమాత్రం లేరని సన్నిహిత వర్గాల సమాచారం.
కాగా అక్టోబర్ 20న ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే అతడు దీపావళికి ముందే జైలు నుంచి బయటకు వస్తాడని ఆశిస్తున్నారు.