telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్” బ్యూటీ పారితోషికంతో నిర్మాతలకు ఫీవర్

Nabha

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఎంతగా మెరుస్తారో… అంతే వేగంగా వెనుదిరుగుతుంటారు. అందుకే నభా నటేష్ లాంటి ఇస్మార్ట్ భామలు తమ డిమాండ్ నడుస్తున్నప్పుడే పారితోషికం కూడా పెంచేస్తారు. ఒకే ఒక్క సూపర్ హిట్ ఖాతాలో ఉన్న మన యంగ్ లేడీ ఫీజు మాత్రం నిర్మాతలకి ఫీవర్ వచ్చేసేలా పెంచేసిందట. నభా ఇప్పుడు ఏకంగా 80 లక్షలు అడుగుతుండటంతో కొందరు దర్శకనిర్మాతలు వెనక్కు తగ్గుతున్నారట. అంతే కాదు, నభా యంగ్ హీరోస్ కంటే స్టార్ హీరోల సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఎంత వరకూ నిజమో కానీ… ప్రస్తుతానికి సాయితేజ్ తో ఒక మూవీ, బెల్లంకొండ సాయితో మరో మూవీ చేస్తోంది నభా. అవి కూడా హిట్టైతే ఈ బెంగుళూరు బ్యూటీ వన్ క్రోర్ మార్క్ ను కూడా తొందరగానే దాటేయవచ్చు. పాతికేళ్లు నిండని ఈ శాండల్ వుడ్ పాప కన్నడంలోనూ మంచి గుర్తింపునే పొందింది. అయితే, తెలుగులో హాట్ లుక్స్ తో ఆకట్టుకోవటంతో యూత్ లో క్రేజ్ అయితే వచ్చింది. ఈమె తెలుగులో ఇప్పటి దాకా చేసింది మూడు సినిమాలే. ‘నన్నుదోచుకుందువటే’ మూవీతో ఎంట్రీ ఇవ్వగా, తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు ‘డిస్కోరాజా’ సరసన తళుక్కుమంది.

Related posts