telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకటేష్ నే పెళ్ళి చేసుకుంటానన్న రాశి… కానీ…!?

Rashi

తెలుగమ్మాయి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు తన హవాను చూపించారు. బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళ హీరోలు విజయ్, అజిత్‌ల సరసన కూడా నటించారు. ఇక తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, జగపతిబాబు, మహేష్ బాబు లాంటి హీరోలతో కలిసి పనిచేశారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ నర్తించారు. ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో రాశి చెప్పుకోదగిన పాత్రలు ఏమీ చేయలేదు. తాజాగా ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తోన్న ‘ఆలీతో సరదాగా’ షోలో రాశి పాల్గొన్నారు. సోమవారం ఈ ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం అవుతుంది. అంతకన్నా ముందు ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాశి చెప్పిన కొన్ని సంగతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర కోసం రాశిని సంప్రదించగా… తాను సరిపోనని చెప్పేశారట. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. తాను పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేష్‌ని కానీ, లేదంటే రాజీవ్ గాంధీని కానీ చేసుకుంటానని రాశి వాళ్ల అమ్మానాన్నలకు చెప్పేవారట. ఈ విషయం గురించి రాశీని ఆలీ అడిగారు. దీనికి రాశి సిగ్గుపడుతూ బిగ్గరగా నవ్వారు. మరి దీనికి ఆమె సమాధానం ఏం చెప్పారో పూర్తి ఎపిసోడ్‌ వస్తే కానీ తెలీదు. ఇదిలా ఉంటే ‘గోకులంలో సీత’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన తాను నటించడానికి కారణం చిరంజీవి గారి భార్య సురేఖ అని రాశి చెప్పారు.

Related posts