telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లి పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్… ఫోటోలు వైరల్

Megastar

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును నిన్న ఘనంగా నిర్వహించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తల్లి చేత కేక్ కటింగ్ చేయించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తల్లి అంజనీదేవి అంటే ఈ అంజనీ పుత్రుడు చిరంజీవికి అమితమైన ప్రేమ. ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లితో మురిసిపోతూ సెల్ఫీ తీసుకుని ఆనందపడ్డారు. ఈ ఫొటోలలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మెగా సిస్టర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అమ్మ పుట్టిన రోజు మాత్రం ఘనంగా చేశాడు. రోజంతా ఆమెతోనే సరదాగా గడిపాడు చిరు. ఫోటోల్లో మనవళ్లు, మనవరాళ్లు, కొడుకుతో కలిసి అంజనా దేవి కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు.

 

View this post on Instagram

 

Happy birthday Naama..😃🤗

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Related posts