telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం :రెండో కంటెస్టెంట్‌గా నువ్వునాకు నచ్చావ్‌ పింకీ ఎంట్రీ

నువ్వునాకు నచ్చావ్‌ సినిమాలో పింకీ పాత్రలో సందడి చేసిన పింకీ అలియాస్ సుదీప రెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టింది.

ఈ సినిమాలో వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఈ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న సుదీప(పింకీ) చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. 1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లో నటించింది. సుదీప ఎక్కువగా ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో అలరించింది.

శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన తర్వాత కూడా సుదీప పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌-6తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

Related posts