telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతనే పెళ్ళికి బలవంతగా ఒప్పించాడు… మాజీ భర్తపై స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు

Angeline

కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఏంజిలినా, బ్రాడ్‌పిట్ 2012లో పెళ్లి చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు పుట్టాక ఏంజిలినాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఇద్దరు పిల్లల్ని జన్మనిచ్చాక మరో నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏంజిలినాతో విడిపోయాక బ్రాడ్‌పిట్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఇందుకు ఏంజిలినా ఒప్పుకోలేదు. ఇందుకు కారణం బ్రాడ్‌పిట్ తాగి పిల్లల్ని కొట్టడమే. తాగుడు అలవాటు ఉండటం వల్ల బ్రాడ్‌పిట్ మైకంలో పిల్లలపై చెయ్యి చేసుకునేవాడట. దాంతో తన పిల్లల జీవితం ఏమైపోతుందోనని భయపడిన ఏంజిలినా బ్రాడ్‌పిట్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తాజాగా ఏంజిలినా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “నా పిల్లల జీవితాలనే కాదు నా జీవితాన్ని కూడా బ్రాడ్ తలకిందులుగా మార్చేశారు. అందుకే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నా. కానీ పిల్లల్ని చూసుకునే హక్కు బ్రాడ్‌కి కూడా ఉంది కాబట్టి అతను ఉండే ప్రదేశంలోనే వేరే ఇల్లు తీసుకుని ఉండాల్సి వస్తోంది. అసలు నేను బ్రాడ్‌పిట్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ అతనే పెళ్లికి బలవంతంగా ఒప్పించాడు. అందుకే ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలేదు” అని వెల్లడించారు.

Related posts