టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం దగ్గరి నుంచి, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలు.. సినీ విశేషాలు చెబుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. యోగా, హెల్త్ టిప్స్ చెబుతూ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెబుతారు. ఫిట్‌నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారు. అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఆమె.. యూట్యూబ్ వేదికగా ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. అలా లక్షలాది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. అయితే.. ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకున్న ఆమె.. ఇప్పుడు నిరుద్యోగులకు మంచి అవకాశం ఇచ్చారు. తమ సంస్థ కోసం గ్రాఫిక్ డిజైనర్లు కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఒక సంవత్సరం ప్రొఫెషనల్ అనుభవం ఉండి, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వారికి మంచి అవకాశం అని తెలిపారు. బీఏ ఫైన్ ఆర్ట్స్ లేదా డిజిటల్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ చేసి ఉండాలని వెల్లడించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలని, అర్హతలు ఉన్నవారు [email protected]కు రెస్యూమ్, సర్టిఫికెట్ కాపీలు, పోర్ట్‌ఫోలియో, చేతి రాత ఫోటో తీసి పంపాలని సూచించారు. ప్రతి బుధవారం అపోలో లైఫ్‌లో జాబ్స్‌కు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని ఆమె పేర్కొన్నారు.
Hey guys check out my tweets every #Wednesday for Job Opportunities in my company. Don’t forget to follow the instructions 👍🏻 #vacancywednesday @Apollo_LStudio pic.twitter.com/R0dvyeIm7s
— Upasana Konidela (@upasanakonidela) 13 November 2019