telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా ఎఫెక్ట్ : మళ్ళీ రద్దవుతున్న రైళ్లు…

first private train booking open tomorrow

ఈ ఏడాది ఆరంభం నుండి ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. అయితే ఇప్పటికే యూరప్ లోని పలు దేశాల్లో ఇప్పటికే  కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెడుతున్నది.  అటు అమెరికాలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఇప్పటికే అమెరికాలో 2.09 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఇక ఇండియాలో రోజుకు 45 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.  అయితే, కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ రైల్వే శాఖ కొన్ని రైళ్లను నడిపింది.  పండగల సమయంలో కొన్ని స్పెషల్ రైళ్లను కూడా వేసింది.  కరోనా భయంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేసేందుకు భయపడుతున్నారు.  తక్కువ ప్రయాణికులతో రైళ్లు నడపడం రైల్వేశాఖకు ఇబ్బందిగా మారింది.  పైగా సెకండ్ ప్రభావం కూడా రైళ్లపై పడే అవకాశం ఉన్నది.  దీంతో కొన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.  విశాఖపట్నం – విజయవాడ, నాందేడ్-పాన్వెల్, ధర్మాబాద్-మన్మాడ్, తిరుపతి-కొల్హాపూర్, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-అకోలా రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. అయితే పండుగ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

Related posts