యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజున హీరో విశ్వక్సేన్ “మాస్ కా బాప్” అంటూ ఓ ట్రిబ్యూట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వక్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాలోని రాప్ సాంగ్‌ను విశ్వక్ ట్రిబ్యూట్ సాంగ్‌గా వాడుకున్నాడు. అయితే తన అనుమతి లేకుండా విశ్వక్ ఈ సాంగ్‌ను వాడుకున్నాడంటూ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. సదరు పాటను తొలగించాలని విశ్వక్ ను కోరినా ఫలితం కనపడలేదు. దీంతో విశ్వక్పై వివేక్‌సాగర్ లీగల్ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే విశ్వక్సేన్ మాత్రం ఫలక్‌నుమాదాస్ చిత్రంలో తాను హీరోగానే నటించడం కాకుండా సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించానని కాబట్టి సర్వహక్కులు తనవేనని అంటున్నాడు. “పాటకు సంబంధించిన వివేక్‌కు క్రెడిట్ ఇచ్చాం. ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను” అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. మరి వివేక్ సాగర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
next post
కంగనా ఘాటు వ్యాఖ్యలు… సమాధానం చెప్పిన రణబీర్