telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు

crime zero fir

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ సుబేదారి స్టేషన్ పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. 24ఏళ్ల యువతి మిస్సింగ్‌పై సుబేదారి పీఎస్‌లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన యువతి అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. హన్మకొండ పట్టణంలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ను జీరో ఎఫ్‌ఐఆర్ పీఎస్‌గా ఎంపిక చేశామని వరంగల్ సీపీ రవీందర్ ప్రకటించారు.

Related posts