telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భారత సైన్యం…

శత్రువు సైతం
నీ ధైర్యం ముందు
వెనుకడుగేసిండు
నీ ఒక్కడి లోనే
భారత సైన్యం
బలాన్ని చూసిండు
నీ ధీరత్వము చూసి
మనసులోనే నీకు సలామ్ చేసిండు
మృత్యువు ముందు నిలుచున్నా
భయమన్నదే ఎరుగని వాడవు
శత్రువు నిన్ను బంధించినా
శిరస్సే వంచని హిమాలయ శిఖరం నీవు
రహస్యాలను రాబట్టాలని చూసినా
దేహం కన్నా దేశం మిన్నని చాటిన సైనికుడవు
నీ చూపులో
వెరుపన్నదే లేదు
నీ మాటలో
తడబాటన్నదే లేదు
నీ నడకలో
రాజసం సడలలేదు
సింహ గాంభీరతకు
ప్రతిరూపం నీవు
శత్రు దేశాన్ని జడిపించే
విహంగ వీరుడవు నీవు
భారతా వనిని రక్షించే
వీర సైనిక సింహానివి నీవు

Related posts