telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

2020 సంవత్సరానికి .. సెలవులు .. ఇవే…

2020 year holidays by central govt

కేంద్రం 2020 సంవత్సరానికి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి, బుద్ధపూర్ణిమ, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్‌ఫ్రైడే, గురునానక్ జయంతి, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహ, మహావీర్ జయంతి, మొహర్రం, మిలాద్ ఉన్ నబిలను సెలవుదినాలుగా ప్రకటించింది. ఈ 14 సెలవు దినాలతో పాటు అదనంగా ఆయా రాష్ట్రాలలో ప్రాధాన్యాలకు అనుగుణంగా మరో మూడు సెలవులు తీసుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది.

ఇందులో దసరా పండుగ మరుసటిరోజు, హోలి, జన్మాష్టమి, మహాశివరాత్రి, వినాయకచవితి, మకర సంక్రాంతి, రథయాత్ర, ఓనం, పొంగల్, శ్రీపంచమితోపాటు ఆయా రాష్ట్రాల్లో జరుపుకొనే ఉగాది లాంటి పర్వదినాలలో ఏవైనా మూడు సెలవులు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇవికాకుండా మరో 34 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.

Related posts