telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్ర‌త్యేక హోదాపై కేంద్రం కుంటిసాకులు చెబుతోంది..

ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఎగ్గొట్టడానికి బీజేపీ కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బీజేపీ హయాంలో ఏర్పడిన నూతన రాష్ట్రాలకు ఏ చట్టంలో ఉందని ప్రత్యేక హోదా కల్పించారో చెప్పాలని ప్ర‌శ్నించారు.

అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాపై ఆడిపోసుకోవడం దినచర్యగా మారిందన్నారు.. ప్రత్యేక హోదా మంజూరుపై బీజేపీ ప్రభుత్వం చెబుతున్న కుంటిసాకులను ఒక్కొక్కటిగా ఆయన తిప్పికొట్టారు.

ఏపీకి ఇస్తే జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలూ డిమాండ్‌ చేస్తాయని కేంద్రం చెబుతోందన్నారు. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను విభజించినా ఏ రాష్ట్రం రాజధానిని కోల్పోలేదన్నా రు. కానీ, విభజనకు గురైన ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయిందన్నారు.

ఇక విభజన చట్టంలో ఎక్కడా ‘హోదా’ ప్రస్తావనే లే నందున మంజూరు చేయలేమని కేంద్రం చెబుతోందని.. ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్‌ విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదాను ఇవ్వలేదా అని ప్రశ్నించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు.

ఏపీ విభజన సందర్భంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని సాక్షాత్తు నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

కానీ ఇప్పుడు హోదా బదులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, హోదాకి ప్ర త్యేక ప్యాకేజీ ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కా దని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Related posts